News March 19, 2025
మహిళ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

మహిళ హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించిందని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. 2013 మార్చి నెలలో రాణి అనే మహిళను రాజశేఖర్ అనే వ్యక్తి బాపట్ల మండలం అడవి పంచాయతీలోని శిథిలావస్థలో ఉన్న భవనంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడన్నారు. బుధవారం న్యాయస్థానం నిందితుడికి శిక్షను ఖరారు చేసిందన్నారు. శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.
Similar News
News October 13, 2025
నిజామాబాద్: అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. వానాకాలం పంట ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు.
News October 13, 2025
మోదీని కలవడం గర్వంగా ఉంది: CM చంద్రబాబు

AP: ఢిల్లీలో PM మోదీతో CM చంద్రబాబు భేటీ ముగిసింది. ఆయన్ను కలవడం గౌరవంగా ఉందని CM ట్వీట్ చేశారు. ‘ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానికి రాష్ట్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు చెప్పా. GST సంస్కరణల విషయంలో ఆయన నాయకత్వాన్ని ప్రశంసించా. కర్నూలులో జరిగే ‘సూపర్ GST-సూపర్ సేవింగ్స్’ కార్యక్రమానికి ఆహ్వానించా. NOV 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకి ఇన్వైట్ చేశా’ అని వెల్లడించారు.
News October 13, 2025
ములుగు: కాంట్రాక్టుల కోసమే మేడారంలో మంత్రుల హడావుడి: బడే నాగజ్యోతి

మేడారంలో కాంట్రాక్టు పనులు, కమీషన్ల కోసమే మంత్రులు హడావుడి చేస్తున్నారని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి ఆరోపించారు. నేటి మంత్రుల పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి మధ్య వివాదమే దీనికి నిదర్శనమన్నారు. మేడారం విశ్వాసం, ఆదివాసీల అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.