News March 19, 2025
మహిళ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

మహిళ హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించిందని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. 2013 మార్చి నెలలో రాణి అనే మహిళను రాజశేఖర్ అనే వ్యక్తి బాపట్ల మండలం అడవి పంచాయతీలోని శిథిలావస్థలో ఉన్న భవనంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడన్నారు. బుధవారం న్యాయస్థానం నిందితుడికి శిక్షను ఖరారు చేసిందన్నారు. శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.
Similar News
News April 23, 2025
నిర్మల్ : ఈనెల 24, 25న సదరం క్యాంప్

ఈనెల 24, 25 వ తేదీల్లో సదరం క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ బుధవారం ప్రకటనలో తెలిపారు. 24వ తేదీన విజువల్ ఎంపైర్మెంట్, 25వ తేదీన ఆర్థోపెడికల్ హ్యాండీక్యాప్డ్ వారికి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంప్ ఉంటుందన్నారు. మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారు వారి సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలని తెలిపారు.
News April 23, 2025
ఫెయిలై ఒకరు.. తక్కువ మార్కులొచ్చాయని మరొకరు సూసైడ్

AP: ఇద్దరు టెన్త్ విద్యార్థులు సూసైడ్ చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. కృష్ణా(D) అర్జువానిగూడెంకు చెందిన G.అనిల్ గతేడాది, ప్రస్తుతం సైన్స్ పరీక్షలో ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకొని చనిపోయాడు. శ్రీకాకుళంలోని బలగ ప్రాంతానికి చెందిన G.వేణుగోపాలరావుకు ఇవాళ టెన్త్ ఫలితాల్లో 393 మార్కులొచ్చాయి. తక్కువ మార్కులొచ్చాయని ఉరేసుకొని మృతిచెందగా, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 23, 2025
పిడుగురాళ్ల: ప్రభుత్వ ఉద్యోగికి సివిల్స్‌లో 830వ ర్యాంక్

పిడుగురాళ్లలో వాణిజ్య శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న భార్గవ ఆల్ ఇండియా స్థాయిలో 830వ ర్యాంకు సాధించారు. 2025లో ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో సత్తా చాటారు. విజయనగరం జిల్లాలోని రాజం గ్రామానికి చెందిన విష్ణు, ఈశ్వరమ్మ దంపతులకు కుమారుడైన భార్గవ బీటెక్ పూర్తి చేశారు.