News March 6, 2025
మహ్మదాపూర్లో చోరీపై ఎస్పీ ఆరా

పాన్గల్ మండలం మహ్మదాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీ జరగ్గా రూ.1.25లక్షలు, 20 తులాల వెండి గొలుసులు దొంగలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయులు ఇంటిని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సందర్శించి ఘటనపై ఆరా తీశారు. ఎస్సైతోపాటు సీఐ, ఎస్సై శ్రీనివాసులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 6, 2025
ఎల్లారెడ్డిపేట: విషాదం.. సౌదీలో ఆగిన గుండె

ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ గుట్టపల్లి చెరువు తండాకు చెందిన వ్యక్తి సౌదీలో గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గుగులోతు రవి అనే వ్యక్తి బతుకుదెరువు కోసం విజిట్ వీసా మీద ఆరు నెలల క్రితం సౌదీ వెళ్లాడు. శనివారం ఉదయం 11 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు అక్కడివారు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహం త్వరగా స్వగ్రామం వచ్చేటట్లు చూడాలని KTRను బాధిత కుటుంబం వేడుకుంటోంది.
News December 6, 2025
మొబైల్ రీఛార్జ్ ధరలపై యూజర్ల ఆగ్రహం!

కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు.
News December 6, 2025
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


