News February 3, 2025
మాంచెస్టర్ అమ్మాయితో చిట్యాల అబ్బాయి పెళ్లి

చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన రాజీవ్ రెడ్డి యూకేలోని మాంచెస్టర్ చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. ఆయన మాంచెస్టర్లో హోటల్ మేనేజెమెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్ శాఖలో పనిచేస్తున్న లారెన్ ఫిషర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. పలువురు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Similar News
News February 15, 2025
నల్గొండ: నేడు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

నల్లగొండ పోలీస్ శాఖ, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం ఎన్జీ కళాశాలలో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్రీడాభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.
News February 15, 2025
నల్గొండ: తెలుగు, ప్రాచ్య భాషల పాఠ్యప్రణాళిక మండలి ఛైర్మన్‌గా బెల్లి యాదయ్య

MG యూనివర్సిటీ తెలుగు, ప్రాచ్య భాషల పాఠ్యప్రణాళిక మండలి ఛైర్మన్‌గా కవి, రచయిత, అసోసియేట్ ప్రొఫెసర్, నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.బెల్లి యాదయ్య నియమితులయ్యారు. ఈ మేరకు MG యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రెండేళ్ల పాటు బెల్లి యాదయ్య ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
News February 15, 2025
నల్గొండ: రిజర్వాయర్‌లో కోళ్ల కళేబరాలు.. ఫామ్ ఓనర్ అరెస్ట్

అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో కోళ్లను పారేసిన కేసులో కోళ్ల ఫామ్ యజమాని రమావత్ రాజమల్లుని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. పడమటి తండా సమీపంలో ఉన్న కోళ్ల ఫామ్‌లో వైరల్ ఫీవర్‌తో చనిపోయిన కోళ్లను రిజర్వాయర్‌కు వచ్చే కాలువలో పడవేశాడని, జలాశయంలోని నీటితో ఎలాంటి ప్రమాదం లేదని ASP తెలిపారు.