News April 2, 2025
మాకవరపాలెంలో రోడ్డు ప్రమాదం.. వార్డు సభ్యుడు మృతి

మాకవరపాలెం మండలంలో అవంతి కళాశాల ఎదురుగా బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమ బోయినపాలెంకి చెందిన వార్డు సభ్యుడు లాలం మణిబాబు మృతి చెందాడు. మాకవరపాలెం నుంచి బైక్‌పై స్వగ్రామం వెళుతుండగా అవంతి కళాశాల వద్దకు వచ్చేసరికి కళాశాల లోపల నుంచి వస్తున్న బైక్ ఢీ కొట్టింది. దీంతో మణిబాబును నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 10, 2025
వెల్గటూర్: తండ్రి హత్య కేసులో కొడుకుకి జీవిత ఖైదు

తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకుకి జీవిత ఖైదు, రూ.6,000 జరిమానా విధిస్తూ జగిత్యాల న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చారు. వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొడిసెలపేటకి చెందిన రెబ్బస్ పోచయ్యను 2022 సంవత్సరంలో తన పెద్ద కొడుకు లచ్చయ్య భూమి విషయంలో తలపై కర్రతో బలంగా కొట్టడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు విచారణ అనంతరం జీవిత ఖైదు, జరిమానా విధించినట్లు తెలిపారు.
News April 10, 2025
కంచ గచ్చిబౌలిలో పర్యటిస్తున్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ

TG: కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది. స్థలాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. అనంతరం ఆ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తుంది. దాన్నిబట్టి అత్యున్నత న్యాయస్థానం విచారణ కొనసాగించనుంది. ఆ భూములను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా HCU విద్యార్థులతో పాటు సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. చివరికి SC జోక్యంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.
News April 10, 2025
కోఠిలో ఉచితంగా రూ.12 లక్షల ఆపరేషన్..!

పలు కారణాలతో చిన్నపిల్లలకు పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంటున్నట్లు కోఠి ENT ఆసుపత్రి డాక్టర్ వీణ తెలిపారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా పిల్లలు వినికిడి లోపాన్ని అధిగమించే అవకాశం ఉందని, రూ.12 లక్షలు ఖర్చు చేసే దీనిని ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏటా కోఠి ఆసుపత్రిలో 60 నుంచి 70 సర్జరీలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
# SHARE IT