News March 5, 2026
మాక్‌డ్రిల్‌లో పాల్గొన్న సిబ్బందిని అభినందించిన కలెక్టర్, ఎస్పీ

జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో భద్రతా వ్యవస్థలను పరీక్షించేందుకు మార్చి 3 నుంచి 5 వరకు ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), ఆక్టోపస్, జిల్లా పరిపాలన, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్న సిబ్బంది, అధికారులను కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు.
Similar News
News April 13, 2026
మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు

మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి పుష్కరణి వద్ద చక్రత్ ఆళ్వార్‌తో కలిపి పంచామృతాలతో స్నపన తిరుమంజసం తదుపరి చక్రస్నానం మహోత్సవం ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పుష్పయాగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News April 13, 2026
TU: ఇంటిగ్రేటెడ్ పీజీ రీవాల్యుయేషన్‌కు రెండు రోజులే గడువు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH/IMBA) విద్యార్థులు ఏప్రిల్‌లో విడుదల చేసిన 3, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాల రీవాల్యుయేషన్‌కు సంబంధిత కళాశాలల్లో మరో రెండు రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ సంపత్ కుమార్ తెలిపారు. సంబంధిత కళాశాలలు ఈ నెల 16లోపు పరీక్షల విభాగంలో దరఖాస్తులను అందజేయాలన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.
News April 13, 2026
అంబేడ్కర్ కోనసీమలో 2400 ఏళ్ల నాటి అద్భుతం.. ఏంటో తెలుసా?

అంబేడ్కర్ కోనసీమలో బౌద్ధం ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి అదుర్రు గ్రామమే నిదర్శనం. ఇక్కడి మహాస్థూపం సుమారు 2400 సంవత్సరాల క్రితం నాటిదని పురావస్తు శాఖ పరిశోధనలో తేలింది. మౌర్య చక్రవర్తి అశోకుని కుమార్తె సంఘమిత్ర.. శ్రీలంకకు వెళ్లే మార్గంలో ఇక్కడ బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఈ స్థూపానికి పునాది వేశారు. సాంచి, సార్నాథ్ తర్వాత ముఖ్యమైన స్థూపాలలో ఒకటిగా అదుర్రు గుర్తింపు పొందింది.


