News November 22, 2024

మాగనూరు ఘటన.. ఎంపీ డీకే అరుణ సీరియస్

image

ప్రభుత్వం అసమర్థత వల్లే మాగనూరు ఘటన జరిగిందని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. ఢిల్లీలో ఉన్న డీకే అరుణ ఈ ఘటనపై స్పందించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం‌ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు కూడా సరైన భోజనం పెట్టకపోవడం దారుణం అన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

Similar News

News November 22, 2024

ఉండవెల్లిలో వివాహిత సూసైడ్

image

వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గద్వాల జిల్లా ఉండవెల్లిలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన స్వాతికి రెండేళ్ల కిందట వివాహం అయ్యింది. తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఎన్నో ఆసుపత్రులకు వెళ్లి చూయించుకుంది. కడుపునొప్పి తగ్గకపోవడంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 22, 2024

NRPT: ‘మిడ్‌డే మీల్స్ మెనూ అమలు కావడం లేదు’

image

నారాయణపేట జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మిడ్‌డే మీల్స్ నిబంధనల ప్రకారం మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. మెనూ అన్నం, మిక్స్ వెజిటేబుల్ కర్రీ, సాంబార్, గుడ్డు పెట్టాలి. కానీ ఎక్కడా అది అమలు కానీ పరిస్థితి నెలకొంది. వారంలో నాలుగు సార్లు మిడ్‌డే మీల్స్‌లో గుడ్డు ఇవ్వాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. గుడ్ల ధర పెరిగిన కారణంగా గిట్టుబాటు కావడం లేదని వంట ఏజెన్సీ వారు చెబుతున్నారు.

News November 22, 2024

కల్వకుర్తి: 24 తేదీన గద్దర్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ

image

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఈ నెల 24న గద్దర్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు నిర్మాణ కమిటీ సభ్యులు సదానందం, శేఖర్ తెలిపారు. భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, సాంస్కృతిక సారధి ఛైర్మన్, గద్దర్ కూతురు వెన్నెల హాజరవుతారని తెలిపారు. ప్రజా సంఘాల, సామాజిక వాదులు, గద్దర్ అభిమానులు హాజరు కావాలని కోరారు.