News November 26, 2024
మాగనూరు: జిల్లా పరిషత్ పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్
మాగనూరు మండల జిల్లా పరిషత్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన పునరావృతమైంది. మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దాదాపు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన పునరావృతం అవ్వడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 2, 2024
శ్రీశైల పశ్చిమ ద్వారం మన అలంపుర్
శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పరిగణించబడి తుంగభద్ర నది తీరాన ఉన్నది. ఇక్కడ పురాతనమైన దేవాలయాలు, బాధమీ చాళుక్య శిల్పా సంపద, సంస్కృతిని సూచిస్తున్నాయి. ఆలయంలో ప్రధాన దేవుళ్లుగా బాల బాలబ్రహ్మేశ్వర , జోగులాంబ అమ్మవారు కొలువైన్నారు, మహాశక్తి పీఠాలలో ఒకటిగా, అష్ట దశ ఆలయ సమూహాల్లో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా, తీర్థ యాత్రల ప్రదేశంగా భక్తులను ఆకట్టుకుంటుంది.
News December 1, 2024
MBNR: లారీ ఢీకొని యువరైతు దుర్మరణం
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని వాడ్యాల గేటు సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువరైతు దుర్మరణం చెందాడు. మండలంలోని దోనూరు గ్రామానికి చెందిన కుమార్ (24) స్పింక్లర్ పైపులు తీసుకొని వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 1, 2024
ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలి: MP మల్లు రవి
రిజర్వేషన్లపై నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన మాలల సింహగర్జన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. మాల, మాదిగలు ఐక్యంగా ఉండి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధనకై ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, మాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.