News September 25, 2024

మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు నెల్లూరులో

image

ఒంగోలు మాజీ MP మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, కావలి మాజీ MLA మాగుంట పార్వతమ్మ నేడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె పార్థివదేహాన్ని నెల్లూరు జిల్లా సరస్వతినగర్‌లోని ఆమె స్వగృహానికి తీసుకెళ్లనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మాగుంట అభిమానుల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం వరకు వారి స్వగృహంలో ఉంచుతారు. 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Similar News

News October 21, 2025

నేడు ఒంగోలులో అమరవీరుల దినోత్సవం.!

image

ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్ వద్ద స్మృతి వనంలోని పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంగళవారం ఉదయం 7.30 గంటలకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నట్లు SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్ అమరవీరుల త్యాగాలు అజరామరం అని పేర్కొన్నారు.

News October 20, 2025

నేడు ప్రకాశం జిల్లా SP కార్యక్రమం రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం (ప్రభుత్వ సెలవు దినం) కావడంతో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయ ప్రయాసలుపడి జిల్లా పోలీసు కార్యాలయంకు సోమవారం రావద్దని ఎస్పీ సూచించారు.

News October 20, 2025

ప్రకాశం జిల్లా కలెక్టర్ కీలక సూచన

image

దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రోజైనందున ఈనెల 20న సోమవారం ఒంగోలు PGRS హాల్‌లో జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించగలరని జిల్లా కలెక్టర్ అన్నారు. కాగా జిల్లా ప్రజలందరికీ ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలను కలెక్టర్ చెప్పారు.