News September 25, 2024
మాగుంట పార్వతమ్మ రాజకీయ నేపథ్యం ఇదే..

ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో 1947 జూలై 27న జన్మించారు. 1967న మాగుంట సుబ్బరామ రెడ్డితో వివాహం జరిగింది. 1996 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంగోలు నుంచి పోటీ చేసి గెలిచి 11వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
Similar News
News September 18, 2025
ఇవాళ ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

ప్రకాశం జిల్లాకు గురువారం సైతం మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటించింది. కాగా బుధవారం ప్రకాశం జిల్లాలోని పలు మండలాలలో జోరు వానలు కురిసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఒంగోలులో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గురువారం కూడా వర్ష సూచన ఉండడంతో, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
News September 17, 2025
ప్రకాశం: ఐటీఐ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్

జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు జిల్లా ఐటీఐ కన్వీనర్ ప్రసాద్ బాబు శుభవార్త చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు. జిల్లాలో మొత్తం 54 ఖాళీలు ఉన్నాయన్నారు.
News September 17, 2025
ఒంగోలులో పిడుగుపాటు.. పదేళ్ల బాలుడి మృతి.!

ఒంగోలులో పిడుగుపాటుకు గురై పదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ఒంగోలు నగరం దద్దరిల్లింది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు శివారు ప్రాంతంలో పదేళ్ల బాలుడు ఇంటి వద్ద ఉన్న క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడినట్లు సమాచారం. దీంతో బాలుడు మృతి చెందగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన బాలుడు కంకణాల చందుగా తెలుస్తోంది.