News December 1, 2024
మాగుంట హత్యకు నేటికి 29 ఏళ్లు..!
ప్రకాశం జిల్లాలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న వ్యక్తి మాగుంట సుబ్బరామిరెడ్డి. నెల్లూరుకు చెందిన ఆయన 1991లో ఒంగోలు MPగా గెలిచారు. మాగుంట ట్రస్ట్తో పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, ఆలయ, కళాశాల నిర్మాణాలు చేపట్టారు. ఆయనను పీపుల్స్ వార్ గ్రూప్ (PWG) నక్సలైట్లు 1995 డిసెంబర్ 1న హత్య చేశారు. ఆయన సతీమణి పార్వతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. సోదరుడు శ్రీనివాసుల రెడ్డి ప్రస్తుతం ఒంగోలు MPగా ఉన్నారు.
Similar News
News December 27, 2024
అభ్యంతరాలు ఉంటే 31లోపు తెలపండి: కలెక్టర్
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ జనాభా వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అన్సారియా శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామన్నారు. దీనిపై జిల్లాలోని ఎస్సీ పౌరులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 31వ తేదీ లోపు సచివాలయాల్లో అందించాలని తెలిపారు.
News December 26, 2024
ప్రకాశం: జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా పేరయ్య
జిల్లా మత్స్యకార సహకార సంఘానికి ఎన్నికలు గురువారం మత్స్య శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా గొల్లపోతు పేరయ్య, వైస్ ప్రెసిడెంట్గా కావేరి. రాములు, మరో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పేరయ్యకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
News December 26, 2024
ప్రకాశం: 6,481 హెక్టార్లలో పంట నష్టం
ఈ నెల 24 నుంచి 26 వరకు ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో మొత్తం 6,481 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.