News March 1, 2025
మాచర్లలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

మాచర్ల మండలం కొత్తపల్లి జంక్షన్ శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన ప్రకాశ్ తన భార్య ప్రసన్నతో కలిసి హైదరాబాద్ నుంచి ఒప్పిచర్లకు కారులో వస్తున్నారు. కొత్తపల్లి జంక్షన్ వద్ద కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రకాశ్ భార్య ప్రసన్న మృతి చెందింది.
Similar News
News March 1, 2025
అనకాపల్లి జిల్లాలో 93.61 శాతం పింఛన్ల పంపిణీ

అనకాపల్లి జిల్లాలో శనివారం సాయంత్రం వరకు 93.61 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద 2,56,274 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,39,892 మందికి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో సబ్బవరం మండలం మొదటి స్థానంలో ఉండగా పాయకరావుపేట చివరి స్థానంలో ఉంది.
News March 1, 2025
వారికి ఎక్స్గ్రేషియా.. సీఎం కీలక ఆదేశాలు

TG: గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రూ.5 లక్షల చొప్పున 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు ఎక్స్గ్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.
News March 1, 2025
నంద్యాల నగరంలో భారీ ర్యాలీ

ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులపాటు మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.