News May 3, 2024
మాచర్ల నియోజకవర్గంలో ఓటర్లు ఎంతమందంటే!

మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,62,404 ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి జె. శ్యామ్ప్రసాద్ గురువారం తెలిపారు. పురుషుల సంఖ్య 1,28,639, స్త్రీల సంఖ్య 1,33,743, ఇతరులు 22 ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలో 299 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. వీటిలో 151 క్రిటికల్ పోలింగ్ బూత్లు ఉన్నాయని వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి కోరారు.
Similar News
News December 27, 2025
GNT: కార్డన్ అండ్ సెర్చ్.. గంజాయి విక్రేతలపై ఉక్కుపాదం

గుంటూరు జిల్లాలో నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో మంగళగిరి, ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పాత గుంటూరు, సౌత్ డీఎస్పీ భానోదయ నేతృత్వంలో నల్లపాడు పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది రౌడీ షీటర్లు, 7 మంది సస్పెక్ట్ షీటర్లు, 7 మంది గంజాయి విక్రేతలకు కౌన్సిలింగ్ నిర్వహించి, సరైన పత్రాలు లేని 149 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలను సీజ్ చేశారు.
News December 27, 2025
మూడు నెలల్లో 218 మంది నిందితులపై కేసు: ఎస్పీ

గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గత మూడు నెలల (అక్టోబర్ 2025 నుంచి డిసెంబర్ 2025) కాలంలోనే 218 మంది నిందితులపై 38 కేసులు నమోదు చేసి, 164 మందిని అరెస్ట్ చేసి, సుమారు 65 కేజీల గంజాయిని మరియు 150 గ్రాముల ద్రవ గంజాయిని, 28 గ్రాముల MDMA, 05 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.
News December 27, 2025
కొత్త ఏడాదిలో.. పాత సమస్యలకు ఎండ్ కార్డు పడేనా..!

గుంటూరు జిల్లా ఎన్నో ఏళ్లుగా మౌలిక వసతుల లోపాలతో ముందుకు సాగుతోంది. డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ ప్రజల నిత్యజీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వేసవిలో తాగునీటి కొరత తలెత్తడంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. ఎన్నికల సమయంలో హామీలు వినిపిస్తున్నప్పటికీ, సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. కొత్త ఏడాదిలోనైనా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.


