News August 6, 2024

మాచర్ల: ‘నేను ఏ తప్పు చేయలేదు’ అంటూ.. సూసైడ్

image

మాచర్లలో సోమవారం విద్యార్థిని <<13779862>>ఆత్మహత్య చేసుకున్న<<>> విషయం తెలిసిందే. తోటి విద్యార్థి రేణుకకు ఫోన్ చేస్తే పనిలో ఉండి స్పందిలేదు. దీంతో అతడు యువతి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. రేణుకకు ఫోన్ చేసిన తండ్రి ‘అబ్బాయిలతో ఏం పని అని కోపడ్డాడు. భయపడిన యువతి తాను అన్నలా భావించిన తోటి విద్యార్థితో ఉన్న సంబంధాన్ని తండ్రి తప్పుగా అర్థం చేసుకున్నాడు. తాను ఏ తప్పు చేయలేదంటూ లెటర్ రాసి హాస్టల్లో సూసైడ్ చేసుకుంది.

Similar News

News December 14, 2025

నిఘా వర్గాలతో నిరంతర పర్యవేక్షణ: SP

image

మహిళలు, విద్యార్థినుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శక్తి, ప్రత్యేక పోలీస్ బృందాలు, నిఘా వర్గాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, సినిమా హాల్స్ , అపార్టుమెంట్లు, బస్టాండ్స్, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు.

News December 14, 2025

మోతడకలో త్వరలో పికిల్ క్లస్టర్: పెమ్మసాని

image

తాడికొండ(M) మోతడక గ్రామంలో రూ.2.3కోట్ల విలువైన బీసీ, ఎస్సీ, ఓసీకమ్యూనిటీ హాల్స్‌ని ఆదివారం కేంద్రసహాయమంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. పూలింగ్ ఇచ్చిన 29 గ్రామాల్లో రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, స్మశానవాటికలు, యూజీడి వంటి మౌలిక సదుపాయాలు పట్టణాలతో సమానంగా అభివృద్ధి చెందుతాయని భరోసా ఇచ్చారు. త్వరలో మోతడకలో రూ.5కోట్లతో పికిల్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.

News December 14, 2025

GNT: రేపు SP పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కారవేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వలన ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలు విషయాన్ని గమనించి పీజీఆర్ఎస్‌కి వచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని ఎస్పీ సూచించారు.