News August 5, 2024
మాచర్ల: బీటెక్ విద్యార్థిని సూసైడ్

మాచర్ల మండలం అలుగురాజుపల్లిలోని న్యూటన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన విద్యార్థిని జక్కి రేణుక ఎల్లమ్మ మాచర్లలోని హాస్టల్ రూమ్లో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రూమ్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 19, 2025
రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి నారా లోకేశ్

మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఆయన స్వీకరించనున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో లోకేశ్ భేటీ కానున్నారు. పార్టీ వ్యవహారాలు, ప్రజా సమస్యలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.
News December 19, 2025
గుంటూరులో గంజాయి అక్రమ రవాణా.. ఐదుగురి అరెస్ట్

గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేసి, 1.20కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్రాడిపేట ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి, నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన CI ఆరోగ్యరాజు, SI క్రిష్ణ బాజీ బాబు, సిబ్బందిని వెస్ట్ DSP అరవింద్ అభినందించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు.
News December 19, 2025
‘పీ4’తోనే పేదరిక నిర్మూలన: కలెక్టర్

పేదరిక నిర్మూలనకు P4 విధానం ఒక గొప్ప వేదికని కలెక్టర్ అన్సారియా అన్నారు. శుక్రవారం ఆటోనగర్లోని ‘పీఐ డేటా సెంటర్’లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంస్థ సీఈవో కళ్యాణ్ ముప్పనేని ఆధ్వర్యంలో ఎంపికైన లబ్ధిదారులకు కుట్టు యంత్రాలు, వ్యవసాయ స్ప్రే ట్యాంకర్లు, ఎలక్ట్రికల్ కిట్లను పంపిణీ చేశారు. పేదల ఆర్థికాభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి చేయూతనందించడం అభినందనీయమని ఆమె కొనియాడారు.


