News August 16, 2024
మాచర్ల మున్సిపాలిటీ కైవసం చేసుకునున్న TDP

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం నమోదు చేయడంతో మాచర్ల పురపాలక సంఘ పరిధిలోని కౌన్సిలర్లు YCPని వీడి TDPలో చేరారు. ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ ఏసోబు, వైస్ ఛైర్మన్ నరసింహారావులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిని కలిశారు. ఇప్పటికే పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. మొత్తంగా 31 మంది కౌన్సిలర్లకు గాను 20 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం.
Similar News
News December 23, 2025
విజయవాడలో ఏఐ వాషింగ్ మెషీన్ల విడుదల

విజయవాడలోని సోనోవిజన్లో ఎల్జీ ఇండియా అత్యాధునిక ‘ఏఐ డీడీ 2.0’ టెక్నాలజీతో 10 కొత్త వాషింగ్ మెషీన్ మోడళ్లను విడుదల చేసింది. సోనోవిజన్ ఎండీ పి.భాస్కర మూర్తి, ఎల్జీ ప్రతినిధులు వీటిని ఆవిష్కరించారు. ఈ మెషీన్లు బట్టల బరువు, మురికిని గుర్తించి వాష్ సైకిల్‌ను నిర్ణయిస్తాయని, స్మార్ట్ కనెక్టివిటీ ద్వారా ఫోన్‌తో నియంత్రించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
News December 23, 2025
పల్స్ పోలియో 99.33 శాతం కవరేజ్: DMHO

గుంటూరు జిల్లాలో DEC 21, 22, 23 తేదీల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో లక్ష్యంగా నిర్ణయించిన 2,14,981 మంది పిల్లలలో 2,13,539 మందికి పోలియో చుక్కలు వేయడంతో 99.33 శాతం కవరేజ్ సాధించినట్లు DMHO డా.విజయలక్ష్మి తెలిపారు. ఇంకా 1,442 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందన్నారు. మిగిలిన పిల్లలకు, టీకాలు వేసే క్రమంలో పోలియో చుక్కలు పంపిణీ ఏఎన్ఎంల ద్వారా వేయడం జరుగుతుందని DMHO తెలిపారు.
News December 23, 2025
అమరావతి బ్రాండ్‌కు ఊపిరి.. ‘ఆవకాయ’ సాంస్కృతిక ఉత్సవం

అమరావతి బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో AP ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా పర్యాటక శాఖ సరికొత్త సాంస్కృతిక ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. ‘ఆవకాయ’ అనే వినూత్న పేరుతో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలని జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడ కేంద్రంగా వేడుకలు నిర్వహించనుంది.


