News May 27, 2024
మాచర్ల: ‘రెచ్చిపోతున్న వైసీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలి’

పట్టణంలో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్న పోలీసులు చర్యలు తీసుకోకపోవటం బాధాకరమని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పాశవికంగా కత్తులతో స్వైర్య విహారం చేయడం పట్ల వారు ఆవేదన వెలిబుచ్చారు. తురక కిషోర్ ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకటేశ్ సుమారు 10కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.
Similar News
News February 13, 2025
26న పోలింగ్ సామాగ్రి పంపిణీ: కలెక్టర్

కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. కలెక్టరేట్ లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ప్రిసైడింగ్ అధికారులు, కమిషనర్లు, ఎంపీడీవోలు, తాహశీల్దార్లు, సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. 26న ఏసీ కళాశాలలో పోలింగ్ కేంద్రాల సామాగ్రిని అందిస్తామని చెప్పారు.
News February 13, 2025
ఎమ్మెల్సీ ఓటుకు ఈ ధృవపత్రాలు తప్పనిసరి: కలెక్టర్

గుంటూరు-కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడానికి EPIC కార్డ్ లేని పక్షంలో ప్రత్యామ్నాయ ధృవపత్రాలు చూపించవచ్చని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్, ఉద్యోగుల సేవా గుర్తింపు కార్డ్, MP/MLA/MLCలు, విద్యాసంస్థలు జారీచేసిన సేవా గుర్తింపు కార్డులతో పాటూ వర్సిటీలు జారీచేసిన సర్టిఫికెట్స్ చూపాలన్నారు.
News February 12, 2025
కొల్లిపరలో భారీ కొండ చిలువ

కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆదాము ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో నిమ్మతోటలో భారీ కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊర్లోకి వెళ్లి గ్రామస్థులను తీసుకువచ్చి కొండ చిలువను పట్టుకొని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలారు. తరచూ గ్రామంలో, పొలాల్లో కొండ చిలువలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.