News March 26, 2025
మాచర్ల: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

మాచర్ల మండలం కొత్తపల్లి జంక్షన్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల వైపు వెళ్తున్న బైక్ను ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఆర్మీ జవాన్ ఇంద్రసేనారెడ్డి(27) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 28, 2025
జూబ్లీ బైపోల్: మంత్రులకు డివిజన్ల బాధ్యతలు

జూబ్లీహిల్స్ బైపోల్లో భాగంగా డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. రహమత్నగర్- కోమటిరెడ్డి, పొంగులేటి, బోరబండ- సీతక్క, మల్లు రవి, వెంగళ్రావునగర్- తుమ్మల, వాకిటి శ్రీహరి, సోమాజిగూడ- శ్రీధర్ బాబు, అడ్లూరి, షేక్పేట్- కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ- దామోదర, జూపల్లి, యూసుఫ్గూడ- ఉత్తమ్, పొన్నం ప్రభాకర్కు ప్రచార బాధ్యతలు అప్పగించారు.
News October 28, 2025
అనకాపల్లి: ‘3,211 మంది పునరావస కేంద్రాలకు తరలింపు’

అనకాపల్లి జిల్లాలో 136 గ్రామాలకు చెందిన 3,211 మంది బాధితులను 108 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం సాయంత్రం తెలిపారు. వారికి పునరావాస కేంద్రాల్లో భోజనంతో పాటు అన్ని సదుపాయాలను కలిపిస్తున్నట్లు చెప్పారు. మండలాల్లో తహశీల్దారులు ఎంపీడీవోలు, గ్రామస్థాయి అధికారులు ఈ కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.
News October 28, 2025
ప్రకాశం: ‘గర్భవతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

గర్భవతులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధా మారుతి తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల గర్భవతులు అప్రమత్తంగా ఉండాలని, డెలివరీ తేదీకంటే ముందుగానే హాస్పిటల్లో చూపించుకోవాలని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని అంగన్వాడీలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరుగుతుందన్నారు. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


