News March 27, 2025
మాచర్ల: రోడ్డు ప్రమాదంలో మరో యువకుడి మృతి

మాచర్లలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన మరో యువకుడు ప్రాణాలు విడిచాడు. అర్ధవీడు(M)నారాయణపల్లికి చెందిన ఆర్మీ జవాన్ ఇంద్రసేనారెడ్డి(27), మార్కాపురం(M) మిట్టమీదపల్లికి చెందిన కాశిరెడ్డి(29) నాగార్జునసాగర్లోని బంధువుల ఇంటికి బైక్పై వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మాచర్ల(M) కొత్తపల్లి జంక్షన్ వద్ద DCM వీరిని ఢీకొట్టింది.
Similar News
News November 18, 2025
జడ్చర్ల: అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే

జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.. వారి వివరాలు పప్పు (ఒడిశా) హరేందర్( బిహార్) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పప్పున్, సాతి మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 18, 2025
ఆంక్షలున్నా US వైపే మన విద్యార్థుల చూపు

ఆంక్షలున్నప్పటికీ భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులకోసం అమెరికా వైపే చూస్తున్నారు. ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ప్రకారం 2024-25లో USలో 11,77,766 మంది విదేశీ విద్యార్థులు చేరగా వారిలో 3,63,019 మంది భారతీయులే. గత ఏడాదితో పోలిస్తే 10% పెరుగుదల ఉంది. చైనీయులు 2,65,919 మంది కాగా ముందటేడాదికన్నా 4% తగ్గుదల నమోదైంది. మొత్తం విద్యార్థుల్లో 57% STEM కోర్సులకు ప్రాధాన్యమిస్తుండగా వారిలోనూ ఇండియన్స్దే అగ్రభాగం.
News November 18, 2025
పొగమంచు తీవ్రత.. అనవసర ప్రయాణాలు వద్దు: ఎస్పీ

వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్నందున, రాత్రి, తెల్లవారుజామున అవసరం ఉంటే తప్ప ప్రయాణాలు చేయవద్దని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే ప్రజలకు సూచించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల దృష్ట్యా, ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.


