News May 24, 2024
మాచర్ల: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మాచర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. మాచర్ల పట్టణానికి చెందిన ముక్కాల శ్రీను (58) పొలంలో ట్రాక్టర్‌తో మందు పిచికారి చేయడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు శ్రీనుకు 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 13, 2025
తుళ్లూరు: చంద్రబాబును కలిసిన డీఆర్డీవో మాజీ ఛైర్మన్

డీఆర్డీవో మాజీ ఛైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను, ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సంబంధించి ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు.
News March 13, 2025
మరో కేసులో బోరగడ్డ అనిల్‌కు రిమాండ్

YCP నేత బోరుగడ్డ అనిల్‌పై మచిలీపట్నం చిలకలపూడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై దూషణ కేసులో అనిల్ కుమార్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయనపై గతంలో చిలకలపూడి PSలో 2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయనను విచారించేందుకు రాజమండ్రి నుంచి కాసేపటి క్రితం అనిల్‌ను పోలీసులు మచిలీపట్నం తీసుకువచ్చి జడ్జి ముందు హాజరుపర్చగా రిమాండ్ విధించారు.
News March 13, 2025
తుళ్లూరు: మైక్రోసాఫ్ట్‌తో లోకేశ్ కీలక ఒప్పందం

రాష్ట్రంలోని యువతకు ఎఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్‌తో ఎపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం మంత్రి లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాది వ్యవధిలో 2లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తుందని లోకేశ్ తెలిపారు.