News May 24, 2024
మాచర్ల: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మాచర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. మాచర్ల పట్టణానికి చెందిన ముక్కాల శ్రీను (58) పొలంలో ట్రాక్టర్‌తో మందు పిచికారి చేయడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు శ్రీనుకు 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 18, 2025
గుంటూరు: పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు మార్చి 6 నుంచి 12 వరకు పరీక్షలు జరగనున్నట్లు వర్సిటీ పరీక్షల నిర్వహణ నియంత్రణ అధికారి ఆలపాటి శివ ప్రసాదరావు పేర్కొన్నారు. సోమవారం టైం టేబుల్ ఆయన విడుదల చేశారు. రెగ్యులర్, సప్లిమెంటరీ, స్పెషల్ ఏడ్యుకేషన్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ 1,2,3 పేపర్లకు 2 నుంచి 3:30 వరకు 4,5,6 పేపర్లకు పరీక్షలు ఉంటాయన్నారు.
News February 18, 2025
దరఖాస్తులను 20 నాటికి అందించాలి: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్‌లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రిసైడింగ్ అధికారులు నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులను ఈనెల 20 నాటికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరే విధంగా అందించాలన్నారు.
News February 17, 2025
విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

10వ తరగతి పరీక్షల విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతవరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఆదేశించారు. సోమవారం, కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 30,460 మంది విద్యార్ధులు 150 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు.