News April 9, 2025
మాచర్ల: సాగర్లో సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ

నాగార్జునసాగర్ డ్యాం రక్షణకు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం మంగళవారం ఉపసంహరించుకుంది. గతంలో నాగార్జునసాగర్ డ్యాం రక్షణ తెలంగాణకు చెందిన ఎస్పీఎఫ్ ఆధీనంలో ఉండేది. తరచూ నీటి విడుదల విషయంలో ఆంధ్ర, తెలంగాణ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండటంతో కేంద్రం జోక్యం చేసుకొని డ్యాం భద్రతను సీఆర్పిఎఫ్కు అప్పగించింది. బలగాలను వెనక్కి వచ్చేయాలని ఆదేశించడంతో డ్యామ్ భద్రత తెలంగాణ ఎస్పీఎఫ్ ఆధీనంలోకి వెళ్లనుంది.
Similar News
News November 13, 2025
సింగరేణిలో 82 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సింగరేణిలో 82 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్సైట్: scclmines.com
News November 13, 2025
GNT: 15వ ఆర్థిక సంఘం సాధారణ నిధులపై సమీక్ష

గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల వివరాల గురించి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కత్తెర హెనిక్రిస్టినా అధ్యక్షత వహించి మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన వర్క్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఛైర్పర్సన్ సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో కృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
News November 13, 2025
నాగార్జున- సురేఖ కేసు.. DEC2కు విచారణ వాయిదా

మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసు మరోసారి వాయిదా పడింది. HYDలోని ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జున వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ఠ దెబ్బతిందని, అందుకే పరువునష్టం దావా వేసినట్లు నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే.


