News February 11, 2025

మాచవరం: ఎడ్ల పోటీల్లో బహుమతిగా బుల్లెట్

image

మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీల్లో మంగళవారం సీనియర్ విభాగం ఎడ్ల జతకు పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి ప్రైజ్ రూ. 2 లక్షలు విలువ చేసే బుల్లెట్ బండిని బహుమతిగా అందజేయనున్నారు. రెండో బహుమతిగా హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌ను కూడా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

Similar News

News November 13, 2025

నాయీ బ్రాహ్మణులకు గుడ్ న్యూస్

image

AP: రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలోని కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు బీసీ సంక్షేమ శాఖ మెమో జారీచేసింది. 1996లోని GO-13లో పేర్కొన్న నిబంధనలను అనుసరించాలని కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ అధికారులకు సూచించింది.

News November 13, 2025

ADB: స్విమ్మింగ్‌లో దూసుకుపోతున్న చరణ్ తేజ్

image

ఆదిలాబాద్‌కి చెందిన కొమ్ము చరణ్ తేజ్ స్విమ్మింగ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇటీవల జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన అతడు తాజాగా ఎస్.జీ.ఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాడు. హైద్రాబాద్‌లోని జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో చరణ్ తేజ్ కాంస్య పతకం సాధించాడు. 400 మీటర్ల ఐ.ఎం విభాగంలో కాంస్యం సాధించి మరోసారి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలిపాడు.

News November 13, 2025

పాలకీడు: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

image

పాలకీడు మండల కేంద్రంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ అడ్డ రోడ్ వద్ద కంకర టిప్పర్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మహంకాళి గూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని ప్రమాద తీరును పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.