News June 12, 2024

మాచవరం: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

image

పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామస్వామి (35) అనే వ్యక్తి పొలంలో పనులు చేసుకుంటుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News December 8, 2025

ఎరీన స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో ఏఎన్‌యూ విద్యార్థుల సత్తా

image

మంగళగిరిలో నిర్మల ఫార్మసీ కళాశాల నిర్వహించిన ఎరీన 2025 స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో ANU విద్యార్థులు సత్తా చాటారు. ఖోఖో ఉమెన్‌లో ప్రథమ, 100 మీటర్ల రిలే రన్నింగ్ ప్రథమ, చెస్‌లో ద్వితీయ స్థానాలు సాధించి బహుమతులు అందుకున్నారు. విజేతలను వర్సిటీ వీసీ గంగాధరరావు అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News December 8, 2025

GNT: అమృత హెల్త్ కార్డులు అందజేసిన కలెక్టర్

image

ప్రభుత్వ గుర్తింపు పొందిన అనాథాశ్రమాల్లో నివసిస్తున్న అనాథ పిల్లల సంక్షేమం కోసం ఎన్టీఆర్ వైద్యసేవ/అమృత హెల్త్ స్కీమ్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అమృత హెల్త్ కార్డులను కలెక్టర్ చిన్నారులకు అందజేశారు. 39 మంది లబ్దిదారులకు ప్రత్యేక అమృత హెల్త్ కార్డులు పంపిణీ చేశామన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో చిన్నారులు వైద్యం పొందవచ్చన్నారు.

News December 8, 2025

GNT: PGRSలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన PGRSలో SP వకుల్ జిందాల్ ఆర్థిక, కుటుంబ, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు, మహిళలు-వృద్ధుల వంటి పలు ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను ఆన్‌లైన్ ద్వారా సంబంధిత స్టేషన్లకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. వీల్‌చైర్‌లో ఉన్నవారి వరకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించగా, అర్జీలు రాయడంలో సహాయం కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు.