News February 7, 2025
మాచవరం: యువతిపై లైంగిక దాడి.. కేసు నమోదు

మాచవరంలో ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన నల్లమేకల వెంకటేశ్ అనే వ్యక్తి లైంగిక దాడి చేశారని బాధితురాలు గురువారం మాచవరం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో వెంకటేశ్ అనే యువకుడు తనపై లైంగిక దాడి చేశాడని, తాను కేకలు వేయడంతో పారిపోయాడని, యువతి బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు.
Similar News
News February 25, 2026
సంగారెడ్డి: 17,616 మంది విద్యార్థుల హాజరు

సంగారెడ్డి జిల్లాలోని 54 పరీక్ష కేంద్రాలో ఉదయం మొదటి సంవత్సరం మొదటి లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 18,179 మంది విద్యార్థులకు గాను 17,616 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్ విద్యాధికారి గోవిందరామ్ మీడియాతో తెలిపారు. విద్యార్థుల హాజరు 96.90%గా ఉందని తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు.
News February 25, 2026
పెద్దపల్లి: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ పాఠశాలల్లో 2026-27 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ తెలిపింది. మండల స్థాయి ఎంపికలు మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు మండల కేంద్రాల్లో, మార్చి 28న జిల్లా స్థాయి ఎంపిక పోటీలు పెద్దపల్లి ఐటిఐ గ్రౌండ్‌లో, 27 ఏప్రిల్ హకీంపేటలో రాష్ట్రస్థాయి ఫైనల్ ఎంపికలు జరుగుతాయని పేర్కొంది.
News February 25, 2026
సంగారెడ్డి: ఇంటర్ పరీక్షా కేంద్రాలు పరిశీలించిన ఎస్పీ

సంగారెడ్డి పట్టణంలోని ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ పారితోష్ పంకజ్ బుధవారం తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు.


