News November 5, 2024
మాచవరం రానున్న డిప్యూటీ సీఎం పవన్

మాచవరం మండలం చెన్నాయపాలెంలోని సరస్వతి ఇండస్ట్రియల్ భూములను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించినట్లు తహశీల్దార్ క్షమారాణి మంగళవారం తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని సుమారు 1000 ఎకరాల వరకు రైతుల వద్ద నుంచి భూములు సేకరించి ఇప్పటివరకు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదన్నారు. దీంతో వవన్ పర్యటనపై జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News December 14, 2025
నిఘా వర్గాలతో నిరంతర పర్యవేక్షణ: SP

మహిళలు, విద్యార్థినుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శక్తి, ప్రత్యేక పోలీస్ బృందాలు, నిఘా వర్గాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, సినిమా హాల్స్ , అపార్టుమెంట్లు, బస్టాండ్స్, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు.
News December 14, 2025
మోతడకలో త్వరలో పికిల్ క్లస్టర్: పెమ్మసాని

తాడికొండ(M) మోతడక గ్రామంలో రూ.2.3కోట్ల విలువైన బీసీ, ఎస్సీ, ఓసీకమ్యూనిటీ హాల్స్ని ఆదివారం కేంద్రసహాయమంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. పూలింగ్ ఇచ్చిన 29 గ్రామాల్లో రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, స్మశానవాటికలు, యూజీడి వంటి మౌలిక సదుపాయాలు పట్టణాలతో సమానంగా అభివృద్ధి చెందుతాయని భరోసా ఇచ్చారు. త్వరలో మోతడకలో రూ.5కోట్లతో పికిల్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.
News December 14, 2025
GNT: రేపు SP పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కారవేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వలన ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలు విషయాన్ని గమనించి పీజీఆర్ఎస్కి వచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని ఎస్పీ సూచించారు.


