News April 27, 2024
మాచారెడ్డిలో రూ.4,98,300 లక్షల నగదు సీజ్
మాచారెడ్డి మండలంలో శనివారం అంతర్ జిల్లా ఘన్పూర్ చౌరస్తా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.4,98,300 లక్షల నగదును పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆ నగదును సీజ్ చేసి సదరు వాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎస్ఎస్‌టీ మహేందర్, సిబ్బంది ఉన్నారు.
Similar News
News November 7, 2024
370 కేంద్రాల్లో ధాన్యం సేకరణ: NZB కలెక్టర్
ప్రస్తుతం 370 కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా 673 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. వాటిలో సన్న ధాన్యం సేకరణ కోసం 439 కేంద్రాలను, దొడ్డురకం ధాన్యం కొనుగోళ్ల కోసం 234 కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు.
News November 7, 2024
నిజామాబాద్ జిల్లాలో నలుగురు సీఐల బదిలీ
నిజామాబాద్ జిల్లాలో నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నార్త్ రూరల్ సీఐ బి.సతీష్ కుమార్, ఆర్మూర్ టౌన్ SHO రవి కుమార్, రుద్రూర్ సీఐ కె.జయేష్ రెడ్డిలను బదిలీ చేస్తూ ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఇక నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పురుషోత్తంను రామగుండం ట్రాఫిక్-1 SHOగా బదిలీ చేశారు.
News November 7, 2024
NZB: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..
కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.