News May 10, 2024

మాచారెడ్డి: ఉరేసుకొని ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మాచారెడ్డి మండలం తండాలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. లావుడ్య నవీన్ (21) కొద్దిరోజులుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆటోలు సరిగ్గా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పులు కూడా పుట్టకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Similar News

News January 20, 2025

NZB: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు వీరే!

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకునే వారి వివరాలు ఇవే. HM కేటగిరీలో బాలచంద్రం(రాకాసిపేట్), శ్రీనివాస్ (పెర్కిట్), SAల్లో కృష్ణారెడ్డి (గూపన్పల్లి), అరుణశ్రీ(కంజర), ఆరోగ్యరాజ్ (గుండారం), సతీశ్ కుమార్ వ్యాస్(బినోల), గోవర్ధన్ (మామిడిపల్లి), హన్మంత్ రెడ్డి (జానకంపేట్), SGTల్లో శ్రీనివాస్(వేంపల్లి), రాధాకృష్ణ (నర్సాపూర్), సాయిలు (కొత్తపల్లి) ఉన్నారు.

News January 20, 2025

NZB: నేడు జిల్లా స్థాయి అవార్డుల పంపిణీ: DEO

image

నిజామాబాద్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) అశోక్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని ఖలీల్వాడీలో ఉన్న న్యూ అంబేడ్కర్ భవన్‌లో ఈ అవార్డుల పంపిణీ ఉంటుందన్నారు. ఈ పంపిణీ గత సెప్టెంబర్‌లో జరపాల్సి ఉండగా వరదల కారణంగా వాయిదా పడిందన్నారు.

News January 20, 2025

NZB: 28 కేంద్రాలు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్నాయి: DGP

image

రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాలు భరోసా కేంద్రాలు లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలికలకు సేవలందిస్తున్నాయని DGP జితేందర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్‌లో 29వ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కాగా 2016 నుంచి 2024 డిసెంబర్ వరకు భరోసా కేంద్రాల ద్వారా పోక్సో వంటి కేసులు 6910, రేప్ కేసులు 1770, డొమెస్టిక్ వైలెన్స్ అండ్ అదర్స్ 11,663 కేసులు పరిష్కరించడం జరిగిందని వివరించారు.