News January 23, 2025
మాచారెడ్డి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మాచారెడ్డి మండలంలోని ఇసాయిపేట్ గ్రామానికి చెందిన వడ్ల నారాయణ(68) అనే వృద్ధుడు ఈ నెల 18వ తేదీ శనివారం బస్టాండ్ ప్రాంతంలో ఉన్న గద్దె పై నుంచి ప్రమాదవశాత్తు పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించగా బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ అనిల్ తెలిపారు. మృతుడి భార్య మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.
Similar News
News February 20, 2025
యాలాల: ఇసుక అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతాం: జిల్లా ఎస్పీ

జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే ఉక్కు పాదం మోపుతామని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. యాలాల మండల పరిధిలోని కూకట్ గ్రామ సమీపంలోని కాగ్న నదిలో ఇసుక రీచ్లను పరిశీలించారు. ప్రభుత్వ అనుమతులకు సంబంధిత అధికారులచే ఇసుక అనుమతి పొందాలని, లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐ నగేష్ ఎస్ఐ గిరి ఉన్నారు.
News February 20, 2025
‘శంభాజీ’పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్

‘ఛావా’లో శంభాజీని ఔరంగజేబు చిత్రహింసలు పెట్టిన సన్నివేశం చరిత్రలో జరగలేదంటూ నటి స్వరభాస్కర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలంటూ ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర చదువుకున్నాను. సినిమాలో చూపించిన హింసలో ఏమాత్రం కల్పితం లేదు’ అని ఒకరు పేర్కొనగా.. ‘శంభాజీ త్యాగాన్ని చులకన చేయడానికి నీకెంత ధైర్యం’ అంటూ మరో నెటిజన్ ప్రశ్నించారు.
News February 20, 2025
మండలానికో నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం:కలెక్టర్

ఖమ్మం : ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మండలానికో నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం తరుణిహాట్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇల్లు నిర్మించే స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.