News April 2, 2025
మాచారెడ్డి: నలుగురు పేకాటరాయుళ్లపై కేసు

మాచారెడ్డి మండలం వాడి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.22,260 నగదు, 4 మొబైల్స్, 2 బైక్స్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్ల వివరించారు. ఎవరైనా పేకాట ఆడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా పేకాట ఆడితే 100కు డయల్ చేసి చెప్పాలన్నారు.
Similar News
News November 24, 2025
ధర్మేంద్ర ఆస్తి ఎంతో తెలుసా?

బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరిగా వెలుగొందిన ధర్మేంద్ర అనారోగ్య కారణాలతో మరణించారు. ఆయన ఆస్తి విలువ రూ.335-450 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది. సినిమాలు, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల ద్వారా ఇంత మొత్తం ఆర్జించినట్లు తెలిపింది. ముంబై-పుణె మధ్యలో ఉండే లోనావాలాలో 100 ఎకరాల ఫాంహౌజ్ ఉందని పేర్కొంది. ఆయన సోషల్ మీడియా అకౌంట్లో ఎక్కువగా ఈ ఫౌంహౌజ్లో చేసే వ్యవసాయం వీడియోలను పోస్ట్ చేయడం గమనార్హం.
News November 24, 2025
సింగూరు డ్యామ్లో 1 నుంచి ‘ఖాళీ’ పనులు

మహానగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం మరమ్మతులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలంటే ముందుగా జలాశయంలో నీటిమట్టం తగ్గించాలి. అందుకే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రోజుకు 30 సెంటీమీటర్లు నీటిని తోడేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. నీటిమట్టాన్ని 517.8 మీటర్లకు తెచ్చి (ప్రస్తుత నీటిమట్టం 520.49 మీ.) ఆ తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
News November 24, 2025
గులాబీ తోటల్లో చీడపీడల ముప్పు

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.


