News April 7, 2025
మాచారెడ్డి: మద్యానికి బానిసై వ్యక్తి మృతి

మాచారెడ్డి మండలం చంద్రనాయక్ తండాకు చెందిన బింగి ధర్మపురికి జమునతో వివాహం చేసుకున్నాడు. పిల్లలు లేకపోవడంతో ఆమె ఐదు సంవత్సరాల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ధర్మపురి మద్యం అలవాటుతో ఇంటికే పరిమితమయ్యాడు. శనివారం కాలకృత్యాలకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ధర్మపురి తిరిగి రాలేదు. అదే రాత్రి వాటర్ ట్యాంక్ మెట్లకు ఉరేసుకొని మృతి చెందినట్టు ఎస్ఐ అనిల్ తెలిపారు.
Similar News
News November 28, 2025
చింతపల్లి: చిలకడదుంపలకు పెరిగిన గిరాకీ

చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో సాగవుతున్న చిలకడ దుంపలకు ఈ ఏడాది గిరాకీ ఏర్పడింది.
ఈ రెండు మండలాల్లో 200 ఎకరాల్లో ఈ పంట సాగావుతోంది. ఎకరాకు ₹25,000 పెట్టుబడి పెడితే ఖర్చులు పోను రూ.25000 ఆదాయం వస్తోందని అంటున్నారు. గతఏడాది బస్తా (80kg) రూ.800 కాగా ఈ ఏడాది రూ.1200కు పెరిగింది. దీనితో గిరి రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇక్కడ పండిన పంట రాజమండ్రి, విజయవాడ, బెంగుళూరు మార్కెట్లకు వెళుతోంది.
News November 28, 2025
చిత్తూరు: ‘జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలి’

అర్హులైన పేదలకు ప్రభుత్వాల సంక్షేమ పథకాలను చేరువచేసి, వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు సూచించారు. చిత్తూరు కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ అధ్యక్షతన కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ZP సీఈవో రవికుమార్ ఉన్నారు.
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.


