News April 1, 2025

మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును కలిసిన వైసీపీ కౌన్సిలర్లు

image

మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు విశాఖలోని సోమవారం కలిశారు. మున్సిపల్ ఛైర్మన్ సావు మురళీ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని, ఎమ్మెల్యే బేబినాయన చేస్తున్న అభివృద్ధికి సహకరించడం లేదని సుజయ కృష్ణరంగారావుకు తెలిపారు. అభివృద్ధి చేయడంలో విఫలం కావడంతో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైట్లు వివరించారు. వైసీపీ మద్దతుతో ఛైర్మన్ పదవి కైవసం చేసుకుంటామని మాజీమంత్రి చెప్పారు.

Similar News

News October 17, 2025

విజయనగరం ఎంప్లాయిస్ గ్రీవెన్స్‌కు 27 ఫిర్యాదులు

image

కలెక్టరేట్లో ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎంప్లాయిస్ గ్రీవెన్స్‌లో 27 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. ట్రెజరీ, డ్వామా, ఈపీడీసీఎల్, మెడికల్ విభాగాలకు చెందిన ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. గత శుక్రవారం అందిన 40 ఫిర్యాదుల్లో చాలావరకు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

News October 17, 2025

గంజాయి కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు: VZM SP

image

2022లో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో అస్సాం రాష్ట్రానికి చెందిన నిందితుడు ఆకాష్ ఖూడా (22)కు మూడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువుకావడంతో శిక్ష పడిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. అదే కేసులో మరో ఇద్దరు నిందితులపై వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.

News October 17, 2025

రుణాల రికవరీపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

బ్యాంకుల నుంచి రుణాలు అందజేయడం చేస్తూనే మరో వైపు ఇచ్చిన రుణాలను రికవరీ చేయించడం కూడా అధికారుల ప్రధాన కర్తవ్యమని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. రుణాలను అందజేయడానికి బ్యాంకులు ఆసక్తి చూపాలని, అప్పుడే పథకాలు విజయవంతంగా నడుస్తాయని అన్నారు. అదే సమయంలో రుణాల రికవరీపై దృష్టి పెట్టాలన్నారు.