News June 11, 2024
మాజీ ఎంపీ బెల్లాన ఇలాకాలో టీడీపీదే జోరు

విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ స్వగ్రామమైన చీపురుపల్లి మేజర్ పంచాయతీలో టీడీపీ ప్రభంజనం కనిపించింది. ఈ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి 7,193 ఓట్లు పడగా… వైసీపీకి 4,988 ఓట్లు వచ్చాయి. చీపురుపల్లి మేజర్ పంచాయితీలో తెలుగుదేశం పార్టీకి 2,205 ఓట్ల భారీ ఆధిక్యత రావడం విశేషం. దాదాపు అన్ని వార్డుల్లోనూ టీడీపీ ఆధిక్యత కనబరిచింది.
Similar News
News January 9, 2026
VZM: ‘పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ త్వరగా పూర్తి చేయాలి’

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్లతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం సాయంత్రానికి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కనీసం 80% పాసుపుస్తకాల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
News January 9, 2026
VZM: ‘పీహెచ్‌సీల్లో వైద్యసేవలు మెరుగుపడాలి’

విజయనరం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలను మెరుగుపరిచి ఓపిని పెంచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆయా శాఖాధికారులను ఆదేశించారు. పీహెచ్సీ వైద్య సేవలపై కలెక్టర్ కార్యాలయం నుంచి శుకవ్రారం వీడియో కాన్ఫరెన్స్‌తో సమీక్షించారు. ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ సర్వేపైనా చర్చించారు. పీహెచ్‌సీల వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపిని రోజుకి 50కి పెంచాలని ఆదేశించారు.
News January 8, 2026
నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగించండి: SP

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నేర సమీక్షను నిర్వహించారు. నేరాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ఎస్పీ దామోదర్ అధికారులను ఆదేశించారు. అన్ని కేసుల్లో ఈ-సాక్ష్య యాప్ వినియోగం, సీసీటీఎన్ఎస్లో వివరాల అప్లోడ్ తప్పనిసరి అన్నారు. ఎన్బీడబ్ల్యూ అమలు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, సైబర్ నేరాలపై దృష్టి పెట్టాలన్నారు.


