News August 25, 2024
మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు రాజకీయ జీవితమిదే.!

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామంలో మే 7, 1958లో <<13940431>>డేవిడ్ రాజు<<>> జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, LLBలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1987లో టీడీపీలో మండల ప్రజా పరిషత్ సభ్యుడిగా ఎదిగారు. ఆ తర్వాత జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1999లో, మొదటిసారి సంతనూతలపాడు నుంచి MLAగా ఎన్నికయ్యారు. 2009, ఎర్రగొండపాలెం నుంచి ఓటమి చెందగా, 2014(YCP)లో గెలిచారు.
Similar News
News December 23, 2025
ప్రకాశం: వలస కూలీతో ఎఫైర్.. భర్తను చంపిన భార్య

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఓ భార్య హత్య చేసింది. ఈ ఘటన HYDలోని బోడుప్పల్లో జరిగింది. అక్కడ నివసించే అశోక్(45), పూర్ణిమ(36) భార్యాభర్తలు. ప్రకాశం జిల్లాకు చెందిన వలస కూలీ మహేశ్(22)తో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 11న అశోక్‌ను పూర్ణిమ, మహేశ్, సాయికుమార్ కలిసి కింద పడేసి చున్నీలతో గొంతు బిగించి హత్య చేశారు. గుండెపోటుగా చిత్రీకరించినా, పోలీసుల విచారణలో నిజం తేలింది.
News December 23, 2025
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు రానున్న భారీ పరిశ్రమ

సౌర విద్యుత్ ఉత్పత్తి భారీ పరిశ్రమ ఏర్పాటుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బల్లికురవ, సంతమాగులూరు మండలాలో 1,591.17 ఎకరాల భూమిని సేకరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. ఈ పరిశ్రమకు కేటాయించే భూసేకరణకు నిధులు విడుదలయ్యాయన్నారు. వేగంగా భూసేకరణ చేపట్టాలన్నారు. 2 వారాలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూమి ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
News December 23, 2025
ప్రకాశం జిల్లాలో యూరియాకై ప్రణాళిక సిద్ధం

ప్రకాశం జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 34878 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లాకు మొత్తం 23115 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికీ 31872 పెళ్లి టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందని డిసెంబర్‌కు 350 మెట్రిక్ టన్నులు రానుందన్నారు.


