News September 15, 2024
మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డిని పరామర్శించిన: కేటీఆర్
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం వారి స్వగ్రామానికి వెళ్లి నాగం జనార్దన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Similar News
News October 9, 2024
MBNR: జూ.అధ్యాపకుల ఎదురుచూపులు..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికైన వారికి ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి 10 రోజుల్లో నియామక పత్రాలు అభ్యర్థులకు అందించనుంది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల భర్తీని పట్టించుకోవడంలేదని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. JL నియామక పత్రాలు వెంటనే అందజేయాలని కోరుతున్నారు.
News October 9, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా…
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లిలో 35.9 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో 35.0 డిగ్రీలు, గద్వాల జిల్లా భీమవరంలో 32.5 డిగ్రీలు, నారాయణపేట జిల్లా నర్వలో 32.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News October 9, 2024
రేపు దద్దరిల్లనున్న మహబూబ్‌నగర్
సద్దుల బతుకమ్మ వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. MBNR, వనపర్తి, NGKL, గద్వాల, NRPTజిల్లాల్లో రేపు రాత్రి సందడే సందడి. జిల్లాల్లో మైదానాలు బతుకమ్మ వేడుకలకు రెడీ అయ్యాయి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి జిల్లా కేంద్రాలతో ప్రధాన పట్టణాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సెంటర్లకు తీసుకొస్తారు. మైదానాల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.