News July 31, 2024
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి చుక్కెదురు

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి చుక్కెదురయింది. బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. పాల్వాయి గేటులో టీడీపీ ఏజెంట్పై దాడి, కారంపూడి సీఐపై దాడి అభియోగాలతో పిన్నెల్లి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో జిల్లా కోర్టులో బెయిల్ కోసం పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా, రెండు కేసుల్లోనూ జడ్జి బెయిల్ నిరాకరించారు. గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే.
Similar News
News November 26, 2025
GNT: ఎండీఎంఏ రవాణాపై పోలీసుల కట్టుదిట్టమైన నిఘా

గుంటూరులో మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా మరింత కఠినమైంది. ఒక వారం వ్యవధిలో ఎండీఎంఏ కొనుగోలు,అమ్మకాలకు సంబంధించిన ఎనిమిది మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎలక్ట్రానిక్ పరికరాల్లో డ్రగ్స్ దాచి యువతకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వృత్తి విద్య చదువుతున్న వారినే లక్ష్యంగా చేసుకుని అలవాటు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. బెంగళూరు–గుంటూరు మార్గంలో రవాణాపై నిఘా కొనసాగుతోంది.
News November 24, 2025
ఆధార్ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జనన ధృవీకరణపత్రాలు లేని వారిని గుర్తించి వారికి ఆధార్ కార్డులు జారీ చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్ వీసీ హాలులో రెవెన్యూ రీ సర్వే , గృహనిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయ సేవలు, ఉపాధి హామీ పథకం అంశాల కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రీసర్వేలో మ్యూటేషన్లు దరఖాస్తులపై రెవెన్యూ డివిజన్ అధికారులు పత్యేక శ్రద్ధ తీసుకొని పరిశీలించాలన్నారు.
News November 24, 2025
అమరావతి: 10 లక్షల సురక్షిత పనిగంటలు పూర్తి

అమరావతిలో నిర్మిస్తున్న హౌసింగ్ & బిల్డింగ్ ప్రాజెక్టులలో భాగంగా NGO టవర్స్ 9 & 12 నిర్మాణ పనులను L&T కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో ఈ నెల 18 వరకు 10 లక్షల సురక్షితమైన పనిగంటలను లాస్ట్ టైమ్ ఇంజరీ లేకుండా విజయవంతంగా పూర్తిచేసిందని అధికారులు చెప్పారు. ఈ ప్రాజెక్టులో సాధించిన మైలురాయి నిర్మాణ రంగంలో CRDA పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనమన్నారు.


