News June 19, 2024
మాజీ కలెక్టర్ శివశంకర్‌ని కలిసిన MLA చదలవాడ
పల్నాడు జిల్లా మాజీ కలెక్టర్ శివశంకర్ లోతేటిని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు బుధవారం కలెక్టర్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చేసిన కృషి అభినందనీయం అన్నారు. నియోజకవర్గాన్ని దేశంలోనే అభివృద్ధికి మోడల్‌గా నిలపాలని అనుకుంటున్నట్లు, ఐఏఎస్ అధికారి తగు సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.
Similar News
News September 13, 2024
మంగళగిరి: టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
వైసీపీ నాయకులు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, తదితరులు పార్టీలో చేరారు.
News September 13, 2024
యాత్రికుల రక్షణకు చర్యలు ప్రారంభించాం: మంత్రి లోకేశ్
కేదార్ నాథ్‍లో చిక్కుకున్న 18 మంది తెలుగు యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం, మంత్రి మాట్లాడుతూ స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, ఈ లోగా యాత్రికులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరామన్నారు. యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.
News September 13, 2024
గుంటూరు: విద్యార్థులకు శుభవార్త చెప్పిన RBI
RBI 90వ వార్షికంలోకి అడుగుపెట్టిన సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90పేరిట క్విజ్ పోటీలు నిర్వహించనుంది. గుంటూరు జిల్లాలోని అన్ని కాలేజీలలో18వేల మంది ఉన్నారు. పాల్గొనే వారు 2024 sep 1కి 25 ఏళ్లలోపు ఉండి, WWW.rbi90quiz.inలో ఈ నెల 17 లోపు అప్లై చేసుకోవాలి. పోటీలు ఈనెల 19-21తేదీ వరకు ఉ.9- రాత్రి 9వరకు జరగనున్నాయి. జాతీయ స్థాయి విజేతలకు వరుసగా రూ.10లక్షలు,రూ. 8లక్షలు, రూ.6 లక్షలు నగదు ఇవ్వనున్నారు.