News January 25, 2025

మాజీ కౌన్సిలర్ దంపతుల మీద దాడిని ఖండించిన పెద్ది

image

నర్సంపేట మాజీ కౌన్సిలర్ వెంకటమ్మ, స్వామి దంపతుల మీద దాడిని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రోడ్డు వెడల్పులో భాగంగా వెంకటమ్మ, స్వామి ఇంటి గోడను కూల్చే విషయంలో కుట్ర జరిగిందని ఆరోపించారు. దాడి జరిగే సమయంలో పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నిస్తే పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదని పెద్ది ఆరోపించారు. కాంగ్రెస్ వారికి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని పెద్ది ప్రశ్నించారు.

Similar News

News January 28, 2025

అర్ధనారీశ్వరుని అలంకరణలో రుద్రేశ్వరస్వామి

image

చారిత్రాత్మకమైన వేయి స్తంభాల దేవాలయంలో నేడు సోమవారం మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ రుద్రేశ్వరస్వామి వారికి అభిషేకం నిర్వహించి అర్ధనారీశ్వరునిగా ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అర్ధనారీశ్వరుని రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మణికంఠ శర్మ తదితరులున్నారు.

News January 28, 2025

పదోన్నతి అర్హత పరీక్షను పరిశీలించిన సీపీ

image

హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐగా పదోన్నతికి మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన అర్హత పరీక్షను వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం పరిశీలించారు. భద్రాద్రి, కాళేశ్వరం జోన్ల పరిధిలో వివిధ పోలీస్ స్టేషనల్లో విధులు నిర్వహిస్తున్న 108 సివిల్ హెడ్ కానిస్టేబుల్లకు అందజేసే ASI పదోన్నతికి సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో అర్హత పరీక్షలు ఏర్పాటు చేశారు. సిపి అంబర్ కిషోర్ ఝా పరీక్షలను పరిశీలించారు.

News January 27, 2025

వరంగల్ రోడ్డులో కారు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు

image

ఖమ్మం, వరంగల్ రోడ్డులోని బెటాలియన్ హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి బొల్లికుంటకు వెళ్తున్న కారు నల్లబెల్లి నుంచి వరంగల్ వెళ్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను 108లో ఎంజీఎంకు తరలించారు. ఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.