News November 28, 2024
మాజీ జడ్పీటీసీ మృతి పట్ల పోచారం సంతాపం
కోటగిరి మాజీ జడ్పీటీసీ శివరాజ్ దేశాయ్ మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శివరాజ్ దేశాయ్ శ్రీనివాస్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ పలు పదవుల్లో కొనసాగారు. రోడ్డు ప్రమాదంలో శివరాజ్ దేశాయ్ మృతి చెందారని వార్త తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. హుటాహుటినా సంగారెడ్డి ఆసుపత్రికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
Similar News
News December 14, 2024
ఎత్తిపోతల పనులకు నిధులు విడుదల చేయండి: ఆర్మూర్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్(SRSP) పై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు ఎత్తిపోతల నిర్మాణం, మరమ్మతుల పనులకు నిధులు విడుదల చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు.
News December 13, 2024
నిజామాబాద్: పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని పండుగల నిర్వహించి విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై కలెక్టర్ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
News December 13, 2024
బిచ్కుంద ఐటీఐ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్
బిచ్కుంద ఐటీఐ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఆయన రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఐటీఐలో అడ్మిషన్ కాకముందు ఏం చదివారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ కాలంలోనే స్వయం ఉపాధి, ఉద్యోగం సాధించవచ్చునని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.