News February 7, 2025
మాజీ మంత్రి అంబటి ట్వీట్‌కి టీడీపీ నేత బుద్దా రిప్లై
ఎన్టీఆర్: రాష్ట్ర మంత్రుల ర్యాంకులలో 8,9 స్థానాలలో ఉన్న లోకేశ్, పవన్‌లకు అభినందనలు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మాజీ MLC బుద్ధా వెంకన్న శుక్రవారం రిప్లై ఇచ్చారు. 8,9 స్థానాలలో ఉన్న మంత్రులు లోకేశ్, పవన్‌లు 1,2 స్థానాలలోకి రావడానికి కృషిచేస్తున్నారని, మాజీ సీఎం జగన్ మాత్రం 11వ స్థానంలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.
Similar News
News February 7, 2025
ప్రధాని మోదీని కలిసిన హీరో నాగార్జున
ప్రధాని మోదీని టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబ సమేతంగా ఢిల్లీలో కలిశారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ, నాగసుశీల సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. ANRపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు.
News February 7, 2025
కశ్మీర్లో ఏడుగురు చొరబాటుదారులు హతం
దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఏడుగురిని భారత సైనికులు హతమార్చారు. వీరిలో ముగ్గురు పాక్ సైనికులు, నలుగురు టెర్రరిస్టులు కావొచ్చని ఆర్మీ అనుమానిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా కృష్ణ ఘాటీ సెక్టార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎల్వోసీ దాటి ఇండియన్ ఫార్వర్డ్ పోస్ట్‌పై దాడికి యత్నించడంతో భారత సైనికులు కాల్పులు జరిపారు.
News February 7, 2025
NZB: కోటగల్లీలో అగ్ని ప్రమాదం, రెండిళ్లు దగ్ధం
నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ మార్కండేయ మందిరం సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీపం కారణంగా ప్రమాదవశాత్తు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మధిర ప్రసాద్, సుమలత అనే ఇద్దరికి చెందిన ఇండ్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు ఇండ్లలోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.