News September 5, 2024
మాజీ మంత్రి జోగి రమేశ్ కోసం పోలీసుల గాలింపు
మాజీ మంత్రి జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇటీవల ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు. దీంతో జోగి, ఆయన అనుచరుల కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.
Similar News
News September 21, 2024
తిరుపతి వెళ్లే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే 2 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు తిరుపతి(TPTY)-విశాఖపట్నం(VSKP) మధ్య ప్రయాణించే ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ నం.22708 TPTY-VSKP రైలును ఈ నెల 29న, నం.22707 VSKP-TPTY రైలును ఈ నెల 30న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
News September 21, 2024
‘యూపీఎస్సీ మెయిన్స్‌కు 128 మంది హాజరు’
ఎస్‌ఆర్‌ఆర్&సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన యూపీఎస్సీ మెయిల్ పరీక్షకు ఏడుగురు గైర్హాజరైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. 135 మంది అభ్యర్థులకు గానూ 128 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. పటిష్ట బందోబస్తు నడుమ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని, అభ్యర్ధులకు అవసరమైన మౌళిక వసతులను కల్పిస్తున్నామన్నారు.
News September 20, 2024
రుణాల రీషెడ్యూలింగ్ దరఖాస్తులు తక్షణ పరిష్కారం: కలెక్టర్
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజల నుంచి వస్తున్న రుణాల రీ షెడ్యూల్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలిపారు. పలు బ్యాంకుల అధికారులు, సబ్ కలెక్టరేట్‌లోని ఫెసిలిటేషన్ కేంద్రం ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఒక్క రోజులోనే 615 ఖాతాలకు సంబంధించి రూ. 51.37 కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు.