News April 13, 2025
మాజీ మంత్రి మనవడికి 444 మార్కులు

ఇంటర్ ఫలితాల్లో మాజీ మంత్రి నారాయణస్వామి మనవడు గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి తనయుడు భువన తేజ సత్తా చాటాడు. MPC విభాగం మొదటి సంవత్సరంలో ఆయన 444 స్కోర్ చేశాడు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
Similar News
News December 7, 2025
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.152 నుంచి రూ.168, మాంసం రూ.220 నుంచి 257 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.251 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు10 కోడిగుడ్ల ధర రూ. 90 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 7, 2025
సదుంలో సినిమా షూటింగ్

సదుం మండలంలోని తాటిగుంటపాలెంలో ‘నాన్న డైరీ’ సినిమా షూటింగ్ మూడు రోజులుగా జరుగుతోంది. క్లైమాక్స్ సంబంధించిన పలు దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు డైరెక్టర్ సురేశ్, నిర్మాత కోటి తెలిపారు. మరో మూడు రోజుల పాటు షూటింగ్ కొనసాగితే చిత్రీకరణ పూర్తి అవుతుందని వారు చెప్పారు. చిత్రంలో పీలేరుకు చెందిన ఖాదర్ బాషా, షాను, సన, సదుంకు చెందిన రచయిత, కళాకారుడు రామయ్య నటిస్తున్నట్లు వెల్లడించారు.
News December 6, 2025
కామాలూరు-చిత్తూరు RTC బస్సు సర్వీసు ప్రారంభం

తవణంపల్లి మండలంలోని కామాలూరు-చిత్తూరు ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం ప్రారంభించారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఇటీవల పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు బస్సు సర్వీసు ప్రారంభించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.


