News July 5, 2024
మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాక్

మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. దూలపల్లిలోని మల్లారెడ్డి వర్సిటీ.. బాలానగర్లో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ పేరుతో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. వర్సిటీతో పాటు.. ఆఫ్ క్యాంపస్ కేంద్రంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
Similar News
News December 21, 2025
చలి గుప్పెట్లో ఉమ్మడి రంగారెడ్డి.. 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. శనివారం మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో అత్యల్పంగా 5.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 5.8, మౌలాలిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చల్లని గాలులకు ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News December 20, 2025
22వ తేదీ నుంచి యథావిధిగా ప్రజావాణి: నారాయణ రెడ్డి

కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం ఈనెల 22 నుంచి యథావిధిగా ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ఉదయం 10 గంటల నుంచి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులతో హాజరు కావచ్చని కలెక్టర్ సూచించారు.
News December 19, 2025
BREAKING: రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు

రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018లో సరూర్నగర్ పరిధిలో 17 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి కేసులో పెళ్లి పెద్దగా వ్యవహరించిన బాలిక తండ్రికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. బాలిక భర్త, తండ్రికి రూ. 75వేల జరిమానా న్యాయమూర్తి వేశారు. బాధితురాలికి రూ.15లక్షల పరిహారాన్ని న్యాయమూర్తి మంజూరు చేశారు.


