News February 6, 2025
మాజీ మంత్రి హరీశ్ రావును కలిసిన సత్యవతి రాథోడ్
మాజీ మంత్రి హరీశ్ రావును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు తనకు శాసనమండలిలో బీఆర్ఎస్ విప్‌గా అవకాశం కల్పించినందుకు గాను సత్యవతి రాథోడ్ హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల సమస్యలపై శాసనమండలిలో గళం విప్పాలని హరీశ్ రావు సత్యవతి రాథోడ్‌కు సూచించారు.
Similar News
News February 6, 2025
ఎమ్మెల్సీ కవితను కలిసిన జడ్పీ మాజీ చైర్పర్సన్, మాజీ సర్పంచులు
జగిత్యాల జిల్లాకు చెందిన జెడ్పి మాజీ చైర్పర్సన్ దావ వసంత, పలువురు మాజీ సర్పంచులు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను గురువారం కలిశారు. సర్పంచులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇప్పించేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి చేయాలని, రైతు భరోసా నిధులు ఏకకాలంలో రైతులందరికీ అందించాలని ఎమ్మెల్సీ కవితకు విన్నవించినట్లు మాజీ ప్రజాప్రతినిధులు తెలిపారు. బకాయిల విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు వారన్నారు.
News February 6, 2025
వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంఏ సోషియాలజీ (ఇంటర్నల్), ఎంఏ సోషియాలజీ (నాన్ ఇంటర్నల్), డేటా సైన్స్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
News February 6, 2025
రూ.72 లక్షలు పెట్టి కష్టపడి వెళ్లినా..
అమెరికా పిచ్చితో హరియాణాకు చెందిన ఆకాశ్ (20) 2.5 ఎకరాల భూమి అమ్మి రూ.65 లక్షలతో అక్రమ మార్గంలో US వెళ్లాడు. ఏజెంట్లకు మరో రూ.7 లక్షలు చెల్లించాడు. పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరించి అక్కడికి వెళ్లానని తెలిపాడు. తాజాగా ఆకాశ్‌ను అమెరికా ప్రభుత్వం ఇండియాకు పంపడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. కాగా పంజాబ్, హరియాణా యువకుల్లో చాలా మందికి ఇంగ్లిష్‌పై పట్టు లేక US వీసాలు పొందలేకపోతున్నారు.