News July 3, 2024

మాజీ సీఎం పర్యటనలో స్వల్ప మార్పు

image

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. ముందుగా నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో హెలిప్యాడ్ లాండ్ అవ్వనుండగా దానికి బదులు కనుపర్తి పాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రౌండ్‌లో లాండ్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. తాడేపల్లి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి నెల్లూరు చేరుకోనున్నారు.

Similar News

News February 18, 2026

5,35,499 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ: DMHO

image

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1-19 సం.లలోపు ఉన్న 5.75,806 పిల్లలలో 5,35,499 మందికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించినట్లు DMHO డాక్టర్ వి.సుజాత తెలిపారు. మొత్తంగా 93% ప్రగతి సాధించినట్లు తెలిపారు. మిగిలిన వారికి ఈనెల 24వ తేదీన ఇవ్వనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

News February 18, 2026

కేంద్రీయ విద్యాలయంలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు రూరల్‌లోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దొరసానమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్, కార్యాలయ సిబ్బంది పోస్టులకు అర్హులైన వారు kothuru.kvs.ac.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్వ్యూలను ఈ నెల 23, 24న తేదీల్లో నిర్వహించనున్నామని చెప్పారు.

News February 18, 2026

నెల్లూరు: ఇలా చేస్తే రూ.5వేలు!

image

నెల్లూరు జిల్లాలో మై భారత్ యువ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి ఆకుల మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన 10 ఉత్తీర్ణులై 2025 ఏప్రిల్ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండి 29 ఏళ్లు లోపు వారు అర్హులన్నారు. రూ. 5వేలు గౌరవ వేతనం ఉంటుందన్నారు. ఈనెల 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.