News January 28, 2025
మాజీ సీఎం ఫొటోతో సర్టిఫికెట్.. కార్యదర్శి సస్పెండ్

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫొటో ఉన్న ఫాం డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన టి.నర్సాపురం కార్యదర్శి జి. లక్ష్మీనారాయణను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన హై సెక్యూరిటీ ఫాం సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంది. నిర్దేశించిన ఫాంలో పాత ఫాం కలవడం, రాత్రిపూట సర్టిఫికెట్ జారీ చేయడంతో పొరపాటున పాత ఫాం పై సర్టిఫికెట్ జారీ అయిందని కార్యదర్శి వివరణ ఇచ్చారు.
Similar News
News January 9, 2026
భద్రకాళి లేక్‌పై రోప్ వేకు అడుగులు!

WGLలోని భద్రకాళి లేక్‌పై రోప్ వే కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పీపీపీ పద్దతిలో 12 నెలల్లో నిర్మించి, 33 ఏళ్ల పాటు లీజు పద్దతిలో ఇవ్వడానికి ప్రతిపాదించింది. రోప్ వేను 1030 మీటర్ల దూరం నిర్మించనున్నారు. గ్లాస్ బ్రిడ్జి స్కైవాక్ 230 మీ.కు రూ.14.50 కోట్లు, రోప్ ద్వారా 800 మీ.కు రూ.65.54 కోట్లు.. మొత్తం రూ.77.04 కోట్లతో నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 45 రోజుల్లో ఫైనల్ చేసేలా రెడీ అవుతున్నారు.
News January 9, 2026
మలేషియా ఓపెన్.. సెమీస్‌కు పీవీ సింధు

మలేషియా ఓపెన్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరారు. జపాన్ షట్లర్, థర్డ్ సీడ్ అకానె యమగూచితో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫస్ట్ గేమ్‌ను ఆమె 21-11 తేడాతో గెలిచారు. అనంతరం మోకాలి గాయం కారణంగా యమగూచి గేమ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. దీంతో సింధు సెమీస్‌కు చేరుకున్నారు.
News January 9, 2026
WGL: 19 నుంచి ఎంఏ తెలుగు సెమిస్టర్ పరీక్షలు

వరంగల్ హంటర్ రోడ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ఈ నెల 19 నుంచి ఎంఏ తెలుగు రెగ్యులర్ కోర్సు సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని పీఠాధిపతి డా.గడ్డం వెంకన్న తెలిపారు. మొదటి సంవత్సరం వారికి తొలి సెమిస్టర్, రెండో సంవత్సరం వారికి మూడో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారు. సంక్రాంతి సెలవులు ఈ నెల 10 నుంచి 17 వరకు ఉంటాయని తెలిపారు.


