News March 2, 2025

మాజీ స్పీకర్ చిత్రపటానికి MHBD కలెక్టర్ నివాళి

image

దుదిల్ల శ్రీపాదరావు మాజీ స్పీకర్ జయంతి వేడుకలను మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ హాజరయి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.

Similar News

News January 7, 2026

పులికాట్ ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన

image

సూళ్లూరుపేటలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లను కలెక్టర్ డా. ఎన్‌.ఎస్‌. వెంకటేశ్వర్ బుధవారం పరిశీలించారు. ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న ఫెస్టివల్‌కు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల పార్కింగ్, భద్రత, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పోలీస్ శాఖలు పాల్గొన్నారు

News January 7, 2026

రివ్యూలో ప్రత్యేక ఆకర్షణగా బీఆర్ఎస్ MLA కడియం

image

ఉమ్మడి వరంగల్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ MLA కడియం శ్రీహరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 5గంటల పాటు కూర్చున్న ఆయన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పురోగతిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మరో ఎమ్మెల్యే పల్లా మాత్రం 10 నిమిషాలు ఉండి వెళ్లిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

News January 7, 2026

MBNR: సంక్రాంతి పండుగ.. NH-43 పై నిఘా..!

image

సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్ర రాజధాని సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి నేషనల్ హైవే–44 పరిధిలోని బాలానగర్ ఫ్లైఓవర్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బాలానగర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న కారణంగా ప్రయాణికులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.