News June 19, 2024

మాజీ CM జగన్‌‌పై ఎస్పీకి ఫిర్యాదు

image

మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రూ.6.67 కోట్ల ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకొని దుర్వినియోగం చేశాడన్నారు. విచారణ జరిపి జగన్, అతనికి సహకరించిన అధికారులపై కేసు నమోదు చేయాలని ఎస్పీ మలికా గర్గ్‌కి వినతిపత్రం అందజేశారు.

Similar News

News September 11, 2024

నానో టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 5సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ నానో టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభాగాధిపతి ఆచార్య వి. రవి కుమార్ తెలిపారు. 3వ విడత వెబ్ ఆప్షన్లు, రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు వెబ్ సైట్‌లో సంప్రదించాలన్నారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ/బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని ఆయన తెలిపారు.

News September 11, 2024

ఎమ్మెస్సీ, ఎం.టెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

image

గుంటూరు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ, ఎం.టెక్, పీహెచ్ఎ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును అక్టోబరు 10వ తేదీ వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని హార్డ్ కాపీలను యూనివర్సిటీలో అందజేయాలన్నారు.

News September 11, 2024

తెనాలి: యువతి ఫిర్యాదుతో యువకుడిపై కేసు

image

యువకుడు మోసం చేశాడని గుంటూరుకు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. యువతి ఇంటర్ చదువుతున్న సమయంలో తెనాలికి చెందిన యశ్వంత్ పరిచయం అయ్యాడు. యశ్వంత్ ఈ సంవత్సరం జూన్ నెలలో తన ఇంటికి పిలిచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని తెనాలి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.