News November 16, 2024
మాజీ MLA టీజేఆర్‌కు కీలక బాధ్యతలు

ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు సంతనూతలపాడు మాజీ MLA టీజేఆర్ సుదాకర్ బాబు, వెంకట రమణా రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌ను సమన్వయం చేసుకుంటూ కేడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.
Similar News
News April 19, 2026
మైనర్లకు వాహనాలు ఇచ్చేవారిపై కేసులు.. జాగ్రత్త: SP

ప్రకాశం జిల్లా SP మైనర్ డ్రైవింగ్‌పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్లలోపు వారికి వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని, పట్టుబడితే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు నమోదుచేసి జరిమానాలు, జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు తెలియక వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తోందన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని SP సూచించారు.
News April 19, 2026
పరిష్కార వేదిక సమయంలో మార్పులు: DRO

ఒంగోలులో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని DRO ఓబులేసు ప్రకటించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు అర్జీలు సమర్పించేవారు ఈ సమయంలోనే ఇచ్చి 12.30 గంటలకల్లా తిరిగి నివాసగృహాలకు చేరుకోవాలని సూచించారు.
News April 19, 2026
కొత్తపట్నం బీచ్‌లో మృతదేహం.. పచ్చబొట్టే ఆదారం

కొత్తపట్నం మండలం పిన్నివారిపాలెం బీచ్ వద్ద ఆదివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానిక మత్స్యకారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరైనా చంపి అక్కడ పడేశారా..? లేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారా..? అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె చేతిపై P.ఎల్లమ్మ అనే పచ్చబొట్టు ఉంది.


