News August 12, 2024
మాజీ MLA పిన్నెల్లి బెయిల్ పిటిషన్ వాయిదా

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల తరఫు లాయర్ అశ్వినీకుమార్ సూచించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి నిశితంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం కేసు తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
Similar News
News December 20, 2025
మంగళగిరి: 79వ రోజు మంత్రి లోకేశ్ ‘ప్రజాదర్బార్’

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయం NTR భవన్లో శనివారం మంత్రి లోకేశ్ 79వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. RTCలో మెడికల్ అన్ఫిట్ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని బాధితులు కోరగా, సానుకూలంగా స్పందించారు. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
News December 20, 2025
జర్నలిస్టుల సెమినార్కు వస్తా: మంత్రి లోకేశ్

APUWJ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించే సెమినార్కు హాజరవుతానని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐజేయూ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని జర్నలిస్టుల బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించిన మంత్రి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
News December 20, 2025
మాస్టర్స్ అథ్లెటిక్స్లో గుంటూరు పోలీసుల పతక వర్షం

నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన 44వ ఏపీ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2025లో గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది సత్తా చాటారు. ముగ్గురు ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు కలిపి ఆరుగురు పాల్గొని మొత్తం 18 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం) సాధించారు. వివిధ వయో విభాగాల్లో ట్రాక్, ఫీల్డ్ ఈవెంట్లలో మెరిసిన విజేతలను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.


